30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్.. సీఎం కార్యాలయం హస్తం! - MicTv.in - Telugu News
mictv telugu

30 కేజీల గోల్డ్ స్మగ్లింగ్.. సీఎం కార్యాలయం హస్తం!

July 7, 2020

30 kgs Gold

కేరళాలో 30 కేజీలో బంగారం స్మగ్లింగ్‌లో ట్విస్ట్ నెలకొంది. ఇటీవల తిరువనంతపురం విమానాశ్రయంలో 30 కేజీల బంగారాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ముఖ్యమంత్రి విజయన్ క్యాంపు కార్యాలయం పాత్ర ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. తిరువనంతపురంలో ఉన్న యూఏఈ  కాన్సులేట్‌కు ఆ బంగారం స్మిగ్లింగ్ జరిగినట్లు కస్టమ్స్ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఇవాళ ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం శివశంకర్‌ను తొలగించింది. మరోవైపు ఈ కేసులో నిందితులైన సరిత్ కుమార్‌, స్వప్నా సురేశ్‌లను కూడా విచారిస్తున్నారు. వీళ్లిద్దరూ యూఏఈ కాన్సులేట్‌లో పనిచేస్తున్నట్లు.. ఐటీ శాఖ కార్యదర్శితో ఈ ఇద్దరికీ అనుబంధం ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. 

ఈ బంగారం స్మగ్లింగ్ ప్రక్రియ, సీఎంవో నుంచి ఫోన్లు వెళ్లడం వల్లే కొనసాగుతున్నట్లు కస్టమ్స్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఈ విషయమై కేరళ విపక్ష నేత రమేశ్ మాట్లాడుతూ.. బంగారం స్మగ్లింగ్‌లో సీఎం కార్యాలయ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు చేశారు. ఈ మేరకు  ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ‘యూఏఈ కాన్సులేట్ అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. కేరళ ప్రభుత్వంలో పనిచేస్తున్నవారు.. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లర్లతో కలిసి దందా సాగిస్తున్నారు’ అని రమేశ్ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి విజయన్ తన వద్ద సెక్రటరీగా ఉన్న శివశంకర్‌ను తప్పించడంతో.. ఆయన స్థానంలో కన్నూరు మాజీ కలెక్టర్ మీర్ మొహమ్మద్‌ను రిక్రూట్ చేసినట్లు సమాచారం.