kerala governer shocking comments on udaypur incident
mictv telugu

తల నరకమని మదర్సాలో బోధిస్తున్నారు : కేరళ గవర్నర్ ఖాన్

June 29, 2022

kerala governer shocking comments on udaypur incident

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కన్హయ్యలాల్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని శాంతిభద్రతలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనపై పలువురు రాజకీయ నాయకులు ఖండించగా, ముస్లిం మత పెద్దలు కూడా హత్యలు చేయడం ఇస్లాంకు వ్యతిరేకమని కరాఖండీగా చెప్తున్నారు.

ఈ క్రమంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మనం కేవలం లక్షణాలను చూసి బాధపడుతున్నాం. కానీ, అసలు రోగంపై దృష్టి పెట్టటం లేదు. దైవ దూషణ చేస్తే తల నరకమని మదర్సాలలో పిల్లలకు బోధిస్తున్నారు. ఇది దేవుడి చట్టంగా వారికి నూరిపోస్తున్నారు. అందుకే మదర్సాలలో ఏం నేర్పుతున్నారనే దానిని పరీక్షించాలి’ అని వ్యాఖ్యానించారు. అటు ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర కోణంపై విచారించాల్సిందిగా కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది.