కేరళ సర్కారు సంచలనం.. సీఏఏ చెల్లదంటూ సుప్రీంలో పిటిషన్  - MicTv.in - Telugu News
mictv telugu

కేరళ సర్కారు సంచలనం.. సీఏఏ చెల్లదంటూ సుప్రీంలో పిటిషన్ 

January 14, 2020

కేంద్రంలోని మోదీ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి తెలంగాణ, కేరళ వరకు రోజూ వేలమంది రోడ్లపైకి వస్తున్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్న కేరళలో తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టం వల్ల తమ రాష్ట్రంలోని ముస్లింల పౌరసత్వానికి ఢోకా ఉండదంటున్న కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 

సీఏఏ రాజ్యాంగ విరుద్ధమంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. దీన్ని రాజ్యాంగ విరుద్ధ చట్టంగా ప్రకటించి కొట్టేయాలని కోరింది. పాస్ పోర్ట్ నిబంధనలు, విదేశీయుల సవరణ నిబంధనలకు ఈ చట్టం విరుద్ధమని పేర్కొంది. సీఏఏని సవాలు చేస్తూ ఓ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకెక్కడ ఇదే తొలిసారి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, దేశవ్యాప్తంగా అస్థిరతకు కారణమవుతోందని ఆక్షేపించింది.