కేరళకు చెందిన లెస్బియన్ జంట అధీలా నస్రీన్ – ఫాతిమా నూరాలను కేరళ హైకోర్టు కలిసి జీవించేందుకు అనుమతినిచ్చింది. అలువాకు చెందిన 22 ఏళ్ల అధీలా, కోజికోడ్‌కు చెందిన 23 ఏళ్ల ఫాతిమాలు సౌదీ అరేబియాలో చదువుకుంటున్నప్పుడు ప్రేమించుకున్నారు. కేరళకు తిరిగి వచ్చాక కూడా వీరి ప్రేమ కొనసాగింది. అయితే వీరి పెళ్లికి ఫాతిమా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో అధీలా పోలీసులను ఆశ్రయించింది.
అయితే పోలీసులు ఇది మీ వ్యక్తిగత వ్యవహారమంటూ కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. దీంతో అధీలా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు జీవించే హక్కు ఉందని వాదించారు. వాదనలను విన్న కోర్టు ఇద్దరినీ కలిసి జీవించేందుకు అనుమతినిచ్చింది. కాగా, అంతకుముందు వీరిద్దరూ ఇంట్లోంచి పారిపోయి LGBTIQల కోసం పోరాడుతున్న వనజా కలెక్టివ్ అనే సంస్థ వద్ద ఆశ్రయం పొందారు. తాజా కోర్టు తీర్పుతో వీరికి అడ్డు లేకుండా పోయింది.