Kerala lottery winner upset as he can’t step out without people asking for money
mictv telugu

లాటరీ గెలవకుంటే బాగుండేది.. ఆటో డ్రైవర్

September 24, 2022

వారం రోజుల క్రితం లాటరీలో పాతిక కోట్లు గెలుచుకొని అదృష్టవంతుడైన ఆటో డ్రైవర్.. ఇప్పుడు అనవసరంగా లాటరీ తగిలిందని బాధపడుతున్నాడు. చాలా మందిలాగే లాటరీ గెలిచినందుకు ఒకటి రెండు రోజులు ఆనందించానని.. కానీ ఇప్పుడు ఇదే ప్రమాదంగా మారిందని చెబుతున్నాడు. కేరళకు చెందిన అనూప్ తన భార్య పిల్లలు, తల్లితో రాజధాని తివేండ్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకారియమ్ లో నివసిస్తున్నాడు. స్థానిక లాటరీ ఎజెంట్ నుంచి టికెట్ కొన్న అనూప్‌కు ఇటీవల జరిగిన డ్రాలో మొదటి ప్రైజ్ గా రూ.25 కోట్లు గెలుచుకున్నాడు. ట్యాక్సులు పోను.. రూ.15 కోట్లను పొందనునున్నాడు.

ఇక లాటరీ గెలుచుకున్నప్పటి నుంచి తెలిసిన వారంతా వారివారి సమస్యలు చెబుతూ.. అవసరాలు తీర్చమంటున్నారన్నాడు. చూద్దాం, చేద్దాం అని సమాధానం చెబుతుంటే.. తనకు తెలిసిన వారు కూడా ఇప్పుడు శత్రువులుగా మారుతున్నారని.. తన ఇంటికి వచ్చే ప్రజల సంఖ్య పెరగడంతో చుట్టుపక్కట వాళ్లు తిడుతున్నారని ఆయన చెబుతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వెళ్లలేకపోతున్నాని..ప్రజలు సహాయం కోసం వెంబడిస్తున్నారని తెలిపాడు. దీని బదులు నేను తక్కువ ప్రైజ్ మనీ ఉన్న లాటరీ గెలిస్తే బాగుండేదని వాపోతున్నాడు. ప్రస్తుతానికి డబ్బు ఏం చేయాలో నిర్ణయించుకోలేదని.. రెండేళ్ల పాటు బ్యాంకులో పెడతానంటున్నాడు.