పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని షాపును కూల్చేశాడు - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నాడని షాపును కూల్చేశాడు

October 28, 2020

Kerala Man Demolishes Neighbour Shop .jp

పెళ్లి సంబంధాలు చెడగొడుతున్నారనే కోపంతో పొరుగింటి వ్యక్తి షాపును ఓ వ్యక్తి కూల్చేశాడు. జేసీబీని తీసుకువచ్చి పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ షాపులో అనేక అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని అతడు ఆరోపించాడు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా  చర్యలు తీసుకోలేదని అన్నాడు. అందుకే తానే స్వయంగా జేసీబీ తెప్పించి కూల్చి వేశానని తెలిపాడు. దీన్నంతటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన అల్బిన్‌ (30) పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంట్లో వాళ్లు సంబంధాలు చూసినా ఎవరూ పెళ్లి చేసేందుకు ముందుకురాలేదు. దీంతో అతడి ఇంటి ఎదురుగా ఉన్న ఓ షాపులో మద్యం, గ్యాంబ్లింగ్, అసాంఘీక కార్యక్రమాలే దీనికి కారణమనే భావనకు వచ్చాడు. అంతే కాకుండా అతడికి వచ్చే సంబంధాలను కూడా కావాలనే చెడగొడుతున్నాడని తెలియడంతో కోపంతో ఊగిపోయాడు. షాపును కూల్చిన వీడియోను మలయాళ సినిమా అయ్యప్పనం కోశియంలోని రియల్‌ లైఫ్‌ సన్నివేశాల పేరుతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.  అతడి ఆరోపణల్లో నిజం లేదని షాపు యజమాని చెబుతున్నాడు. వ్యక్తిగత కక్షతోనే ఇలా చేశాడని పేర్కొన్నాడు.