కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ లేదన్నా చాలా మంది తప్పుడు ప్రచారాలను ఆపడం లేదు. రకరకాల పుకార్లతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కొంత మంది దీనికి ఆల్కహాల్ విరుగుడు అంటూ పేర్కొనడంతో చాలా మంది నాటుసారా, మద్యం తాగి మరణించారు. కొంత మంది అయితే వేపచెట్లకు నీళ్లు పోయడం, ఉమ్మెత్త రసం తాగడం లాంటి పనులు చేశారు. తాజాగా మరో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కిరోసిన్‌తో ఈ వైరస్‌ను దూరం చేయవచ్చని వెల్లడించాడు.
కేరళకు చెందిన పెరిన్‌థల్మాన్నాకు చెందిన రోనాల్డ్ డేనియల్(64).. కరోనా వైరస్‌ను కిరోసిన్‌తో నయం చేయొచ్చని నమ్మించేందుకు ప్రయత్నించాడు. 11 రోజుల పాటు దీన్ని తాగితే ఆ వైరస్ చనిపోతుందని అతడు పేర్కొన్నాడు. తనకు అవకాశం ఇస్తే వైరస్‌ను ప్రజలను కాపాడతానని ప్రచారం చేశాడు. దీనిపై కేరళ సీఎంకు కూడా ఓ మెయిల్ పెట్టారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.