భారతీయుడి ఆత్మాహుతి దాడి.. 29 మంది బలి - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుడి ఆత్మాహుతి దాడి.. 29 మంది బలి

August 4, 2020

Kerala man in afghanistan incident .

దారి తప్పి ఇస్లామిక్ ఉగ్రవాదుల్లో చేరి వారి మతోన్మాదాన్ని నరనరానా జీర్ణించుకున్న భారతీయ యువకుడు మారణ హోమం సృష్టించాడు. కేరళకు చెరందిన కాలెకెట్టియ పురయిల్ ఇజస్ అనే యువకుడు అప్ఘానిస్తాన్‌లో జరిపిన ఆత్మాహుతి దాడిలో 29 మంది చనిపోయారు. ఆదివారం జలాలాబాద్ జైల్లో ఈ ఘోరం జరిగింది. ఈ ఘటనలో 300 మంది ఖైదీలు పారిపోయారు. 30 మందికిపైగా ఐసిస్ ఉగ్రవాదులు  దాడిలో పాల్గొన్నారు. 

కాసరగోడ్ జిల్లాకు చెందిన పురయిల్ దాడికి పాల్పడినట్లు ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండిట్ ట్వీట్ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అదే మాట చెబుతున్నాయి. పురయిల్ దాడిలో పాల్గొన్నట్లు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కూడా చెప్పుకొచ్చింది.  పురయిల్ 2016లో జూన్‌లో భారత్ నుంచి పారిపోయాడు. ఇరాన్ లోని ఖోరాసెన్ వెళ్లి ఐసిస్ ఉగ్రవాదుల్లో చచేరిపోయాడు. ప్రస్తుతం అతని భార్య రాఫేలా, కొడుకు అప్ఘాన్ పోలీసులు అదుపులో ఉన్నాడు.