బ్రష్ చేయకుండా కిస్.. వద్దన్న భార్యను చంపేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

బ్రష్ చేయకుండా కిస్.. వద్దన్న భార్యను చంపేశాడు..

July 5, 2022

బ్రష్ చేయకుండా కొడుకును ముద్దు పెట్టుకోవద్దని చెప్పినందుకు.. కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ వ్యక్తి. కేరళలోని పాలక్కడ్లో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన దీపిక(28), తన భర్త అవినాశ్(30)తో కలిసి పాలక్కడ్లోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటోంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. బ్రష్ చేయకుండా కుమారుడ్ని ముద్దు పెట్టుకునేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది.

ఈ విషయంపై ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడైన అవినాశ్.. దీపికపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె తల, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. పొరుగింటివారు దీపికను స్థానిక ఆస్పత్రికి తలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు అవినాశ్ ఎయిర్ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి కరకురిస్సికి మారాడు. అవినాశ్కు దీపిక రెండో భార్య. ఒడిశాకు చెందిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అతడు.. 2019లో దీపికను పెళ్లి చేసుకున్నాడు.