చెప్పి మరీ కొట్టాడు.. లాటరీలో 12 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

చెప్పి మరీ కొట్టాడు.. లాటరీలో 12 కోట్లు

September 21, 2020

Kerala man won 12 crore lottery

కరోనా వైరస్ విపత్కర సమయాల్లో కేరళకు చెందిన ఓ యువకుడికి జాక్‌పాట్ తగిలింది. తాజాగా నిర్వహించిన లాటరీలో అతడు ఏకంగా రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. రాష్ట్రంలోని ఇడుక్కికి సమీపంలోని తోవాల గ్రమానికి చెందిన అనంతు విజయన్(24) కొచ్చిలోని ఓ గుడిలో క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం రోజున అతను తన స్నేహితులో సరదాగా మాట్లాడుతూ..’ఈరోజు సాయంత్రానికి కల్ల లాటరీ గెలుస్తానని’ అన్నాడు. 

అదే రోజు సాయంత్రం లక్కీ డ్రా నిర్వహించిన కేరళ ఓనమ్ బంపర్ లాటరీలో విజయన్ కోనుగోలు చేసిన బిఆర్75 టీబీ173964 నెంబర్ గల లాటరీ టికెట్ విజేతగా నిలిచింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవ్. దీని గురించి విజయన్ మాట్లాడుతూ..’నేను లాటరీ గెలిచిన విషయాన్ని మొదట నా తల్లిదండ్రులకు చెప్పాను. తొలుత వాళ్లు నమ్మలేదు. జోక్ చేస్తున్న అనుకున్నారు. కానీ, నేను చెప్పింది నిజమని తెలియడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.’ అని తెలిపాడు. అన్ని పన్నులు మినహాయించి విజయన్ చేతికి రూ. 7.57 కోట్లు రానున్నాయి. ఈ డబ్బుతో తన కుటుంబం కష్టాలు అన్ని తీరుతాయని అతడు తెలిపాడు.