లాక్‌డౌన్‌పై కేరళ మంత్రి సంచలన వ్యాఖ్య - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌పై కేరళ మంత్రి సంచలన వ్యాఖ్య

September 28, 2020

mbhmv

దేశంలో ఓవైపు కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయినా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నారు. జనజీవనం మెల్లగా సాధారణ స్థితికి వస్తోంది. ఈ క్రమంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదేమోనని పేర్కొన్నారు. నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తే కరోనాను అదుపుచేయడం మరింత కష్టం అవుతుంది.

ఓనం పండుగ తరువాత రాష్ట్రంలో కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో అక్కడ ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలు కఠినంగా అమలు చేస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదని అభిప్రాయపడ్డారు. అందుకే మరోసారి తిరిగి లాక్ డౌన్‌ను అమలు చేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. కేరళలో ఇప్పటి వరకు 1,75,384 కరోనా 677 మంది చనిపోయారు. 1,18,447 మంది కోలుకున్నారు.