శభాష్ కలెక్టర్.. అడవిబిడ్డల కోసం స్వయంగా ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

శభాష్ కలెక్టర్.. అడవిబిడ్డల కోసం స్వయంగా ఇలా.. 

March 31, 2020

Kerala MLA, Collector Trek With Supplies To Help Tribal Communities

కరోనా లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా కోట్లమంది పేదలు నానా అగచాట్లూ పడుతున్నారు. నిత్యావసరాలు దొరక్కా, దొరికినా భారీ ధరలకు కొనలేక కడుపు మాడ్చుకుంటున్నారు. ఇక మూరుమూల పల్లెలు, అడవి గ్రామాల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. వారికి సరుకులు చేరవేయడం కష్టంగా మారిపోయింది. దీంతో తిండి, ఔషధాలు దొరక్క కొంతమంది చనిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిస్థితి గమనించిన ఓ కలెక్టర్ స్వయంగా నడుం బిగించారు. కేరళలోని పత్తినంతిట్ట జిల్లా కలెక్టర్ పీబీ నూహ్, సీపీఎం ఎమ్మెల్యే జెనిష్ కుమార్ ఆహారసామగ్రిని భుజాలపై మోసుకుంటూ గిరిజన గ్రామాలకు చేరవేశారు. గిరిజన గూడెంలోని 37 కుటుంబాలకు నిత్యావసరాలను అందించడానికి వీరు అరగంట పాటు కొండలు, గుట్టల్లో నడిచారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.