మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

మసీదులో హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి..

January 20, 2020

ghjkl;

మన దేశం మత సామరస్యానికి మరోసారి వేధికగా నిలిచింది. ఓ హిందూ యువతికి మసీదులో ముస్లిం పెద్దలు వివాహం జరిపించారు. సంప్రదాయ పద్దతిలో వేద మంత్రాలతో బంధు మిత్రుల సమక్ష్యంలో ఘనంగా నిర్వహించారు. కేరళలోని చెరుపల్లి చెరుపల్లి జమాత్ మసీదులో ఈ పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు, ముస్లిం పెద్దలు హాజరై, యువ జంటకు ఆశీస్సులు అందించారు. 

అంజు అనే యువతికి కృష్ణపురానికి చెందిన శరత్ సాసి అనే వ్యక్తితో ఈ వివాహం జరిపించారు. అంజు తండ్రి అశోక్ కుమార్ ఇటీవల గుండె పోటుతో మరణించాడు. దీంతో ఆమె పెళ్లి చేయడం తల్లికి కష్టంగా మారడంతో  స్థానిక ముస్లిం పెద్దలను విజ్ఞప్తి చేసింది. దీంతో ఆమెకు వివాహం జరిపించేందుకు ముందుకు వచ్చారు. జమాత్ మసీదులో హిందూ సంప్రధాయ పద్దతిలో పెళ్లి జరిపించారు. ఈ సందర్భంగా అంజుకు 10 తులాల బంగారంతో పాటు రూ. 2 లక్షలు కట్నంగా ఇచ్చారు. వివాహం తర్వాత 1000 మంది అతిథులకు  శాకాహార విందును ఏర్పాటు చేసినట్టు మసీదు కమిటీ కార్యదర్శి నుజుముద్దీన్ అలుమ్మూట్టిల్ వెల్లడించారు. తమ కూతురు పెళ్లిన ఘనంగా జరిపించినందుకు అంజు తల్లి బింధు కృతజ్ఞతలు తెలిపారు.