మాస్కులు ధరించకపోతే రూ.10 వేలు ఫైన్, రెండేళ్లు జైలు - MicTv.in - Telugu News
mictv telugu

మాస్కులు ధరించకపోతే రూ.10 వేలు ఫైన్, రెండేళ్లు జైలు

July 5, 2020

Face Mask.

ముఖానికి మాస్కులు ధరించకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అక్కడ కరోనా నివారణ చర్యలు చాలా కఠినంగా అమలు పరుస్తోంది ప్రభుత్వం. అయినప్పటికీ రోజురోజుకూ అక్కడ కరోనా  పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. 

దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ మాస్కులు ధరించాలని సూచించింది. మాస్కులు ధరించనివారిపై రూ.10 వేల జరిమానా విధిస్తామని కేరళ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది. అలాగే రెండేళ్లు జైలుశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా సమయంలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ముఖానికి మాస్కులు ధరించనందుకు జరిమానాను రూ.10 వేలకు పెంచినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. కరోనాతో పోరాడటానికి అంటువ్యాధి నిర్వహణ నియమాలను సవరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.