ఆవుపై అత్యాచారం! అంతటితో ఆగకుండా హత్య కూడా.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆవుపై అత్యాచారం! అంతటితో ఆగకుండా హత్య కూడా..

January 10, 2020

Kerala.

దేశంలో మహిళలపై వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్న కామాంధులు మూగజీవాలను కూడా వదలడం లేదు. తాజాగా కేరళలో ఓ కామాంధుడు ఆవును అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పాలక్కడ్ జిల్లా మన్నార్‌కడ్‌ సమీపంలోని మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్‌ అనే రైతు పాడి వ్యాపారం చేస్తుంటాడు. ఈ నెల 6న అతడి ఆవు కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. కానీ, గత బుధవారం ఉదయం గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో ఆవు విగతజీవిగా కనిపించింది. దాని మర్మాంగాల వద్ద గాయాలున్నట్లు గమనించిన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆవును అత్యాచారం చేసి చంపేశారని ఆరోపించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆవు కళేబరాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వెటర్నరీ డాక్టర్లు దానికి పోస్టుమార్టం నిర్వహించారు. కానీ, పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా బయటికి రాలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాతే నిజానిజాలు బయటపెడతామని పోలీసులు చెబుతున్నారు. ఆవుపై అత్యాచారం జరిగిన వార్త పాలక్కాడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.