గుండు చేయించుకున్న మహిళా పోలీస్.. ఎందుకంటే - MicTv.in - Telugu News
mictv telugu

గుండు చేయించుకున్న మహిళా పోలీస్.. ఎందుకంటే

September 26, 2019

మహిళలకు పొడవాటి కురులే అందం. శిరోజాల విషయంలో వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒకటి రెండు వెంట్రుకలు ఊడిపోయాయంటే తెగ బాధపడిపోతుంటారు. కానీ కేరళకు చెందిన ఓ పోలీసు అధికారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఓ మంచి పని కోసం ఏకంగా గుండు చేయించుకున్నారు. పోలీసు నిబంధనలు పక్కనపెట్టి ఆమె చేసిన ఈ పనికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.  

Kerala Police.

త్రిశూర్‌లో ఇరింజలకుడలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో పనిచేసే సీనియర్ అధికారి అయిన అపర్ణ లవకుమార్ క్యాన్సర్ రోగుల కోసం తన జుట్టును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. కిమోథెరపీ వల్ల చాలా మంది రోగులు జుట్టు కోల్పోయి బాధను అనుభవిస్తారు. అలాంటి వారికి అండగా ఉండేందుకు తన వెంట్రుకలను విగ్గు తయారు చేసేందుకు ఇచ్చారు. క్యాన్సర్‌ అవేర్‌నెస్‌ డ్రైవ్‌లో​ భాగంగా స్థానిక పాఠశాలలో ఓ పదేళ్ల చిన్నారిని కలిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కేరళ పోలీసు మాన్యువల్‌ ప్రకారం గుండు చేయించుకోవాలంటే ఉన్నతాధికారుల అనుమతి తప్పని సరి. అందుకే అధికారుల పర్మిషన్ తీసుకొని ఆమె గుండు చేయించుకున్నారు. గతంలోనూ ఆమె ఇలానే చేశారు. కానీ అప్పుడు భుజాల వరకు మాత్రమే జట్టు కత్తిరించుకున్నారు. ఇప్పుడు మాత్రం పూర్తిగా తన జట్టును గుండు కొట్టించుకుని ఇచ్చేశారు.