సైకిల్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవా.. అయితే కట్టు జరిమానా ... - MicTv.in - Telugu News
mictv telugu

సైకిల్‌పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోవా.. అయితే కట్టు జరిమానా …

October 8, 2018

మోటార్ వాహనం, కారు నడిపే వ్యక్తులకు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పని సరి. అవిలేకుండా వాహనాలు నడిపితే ఫైన్ కట్టాల్సిందే. కానీ కేరళ పోలీసులు సైకిల్ నడిపే వ్యక్తికి  హెల్మెట్ లేదని జకిమానా రూ. 2వేలు విధించారు. అతను ఆశ్చర్యపోయాడు. సైకిల్ నడిపితే కూడా హెల్మెట్ పెట్టుకోవాలా అని వాదించాడు. అయినా అతని వాదనను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫైన్ కట్టాల్సిందేనని హుకుం జారీచేశారు. తన దగ్గర డబ్బులు లేవని పోలీసులను వేడుకున్నా వినకుండా రూ. 500 కట్టించుకున్నారు. Kerala Police Makes a Bicycle Rider Pay Fine For Not Having Licenseఆశ్చర్యకర ఈ ఘటన కేరళలోని కసర్‌గోడ్ జిల్లాలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖాసిం కేరళలో వలస కూలీ. కంబాలాలో ప్రధాన రహదారిపై సైకిల్‌పై వెళ్తుండగా అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ జరిమానా విధించారు. హెల్మెట్ లేకుండా  వాహనాన్ని వేగంగా వెళ్లడం నేరమంటూ రూ.2 వేల జరిమానా విధించారు. తన దగ్గర అంత డబ్బులు లేవని పోలీసులను ఖాసీం వేడుకున్నాడు. అయినా వినలేదు. చివరికి రూ. 500 కట్టాలని చెప్పారు. అంతేకాకుండా తన సైకిల్ టైర్లలోని గాలిని కూడా తొలగించారు. చేసేదేమీలేక అతను రూ. 500 కట్టేశాడు.

ఖాసింకు ఇచ్చిన చలానా రసీదుపై ఓ మహిళకు చెందిన స్కూటరు వివరాలు ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. రూ.500 కట్టే వరకు పోలీసులు తనను విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అదికాస్తా వైరల్ అయి ఎస్పీ దృష్టికి చేరింది. తీవ్రంగా పరిగణించిన ఆయన విచారణకు ఆదేశించారు. పోలీసుల పనితీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.