అత్యాచారం కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. ఆ వెంటనే బెయిల్‌పై విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

అత్యాచారం కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. ఆ వెంటనే బెయిల్‌పై విడుదల

July 3, 2022

అధికార మదంతో, కొందరు రాజకీయ నాయకులు మహిళలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కొన్ని రోజుల కిందట ఒడిషాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు తనను మోసం చేశారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి కేరళ రాష్ట్రంలో జరిగింది. కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్(70) తనను లైంగికంగా వేధించాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 10 న జార్జ్ తనను థైకాడ్ లోని, గెస్ట్ హోస్ కు పిలిచి అత్యాచారం చేశాడని తెలిపింది. ఆ తర్వాత.. తరచుగా బెదిరించే వాడని, అశ్లీల మెసేజ్‌లు పంపి బెదిరింపులకు గురిచేసేవాడని తెలిపింది.

ఈ క్రమంలో దీంతో విసిగి పోయిన సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి మేజిస్టీరియల్ కోర్టులో హాజరు పరిచారు. జార్జ్‌కు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. మరోవైపు, తనపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు జార్జ్ ఖండించారు. కొసమెరుపు ఏంటంటే సదరు మహిళ సోలార్ ప్యానెళ్ల కుంభకోణం కేసులో నిందితురాలు అవడంతో .. .ఆ కేసులో ఆమెకు మద్దతుగా స్టేట్‌మెంట్ ఇవ్వలేదన్న అక్కసుతోనే ఆమె తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందన్నారు జార్జ్. అయితే జార్జ్‌కు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు.