Kerala thief sends Rs.2000 for 'material stolen', seeks forgiveness
mictv telugu

సారీ అక్కా.. వడ్డీతో సహా చెల్లించిన దొంగ..

August 12, 2022

Kerala thief sends Rs.2000 for 'material stolen', seeks forgiveness

“తప్పనిసరి పరిస్థితుల్లో చాలా ఏళ్ల క్రితం మీ దగ్గర రూ.700 విలువైన సరకు దొంగతనం చేశా. ఇప్పుడు ఆ సరుకు విలువ రూ.2000 ఉంటుంది. దయచేసి ఈ డబ్బు తీసుకుని నన్ను క్షమించండి” అంటూ వచ్చిన లెటర్ చూసి ఆ మహిళ షాక్ అయింది. ఎవరు రాశారో తెలియని ఆ లెటర్ చూసి కాస్త కంగారు పడింది కూడా. ఒంటరిగా ఉన్న తనకు ఈ డబ్బులు కాస్త అవసరం పడతాయనుకుంది. కేరళలోని వయనాడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

జిల్లాలోని పుల్పల్లి సమీపంలోని పట్టనికూప్‌కు చెందిన మేరి.. భర్త జోసెఫ్ పదేళ్ల క్రితం చనిపోవడంతో ఒంటరిగానే జీవిస్తుంది. పిల్లలు, మనుమళ్లు, మనవరాళ్లు అందరూ కూడా దగ్గరలోని సిటీలు ఉండడం వల్ల వారి నుంచి గ్రీటింగ్ కార్డులు తప్ప.. ఆమెకు ఎప్పుడూ పోస్ట్‌లో ఉత్తరాలు రావు. అనుకోకుండా బుధవారం ఆమెకు ఓ లెటర్ వచ్చింది. ఆ లెటర్ పైన చూస్తే పంపినవారి అడ్రస్ లేదు. దీంతో కాస్త కంగారుగానే ఆ లెటర్ ఓపెన్ చేసింది. లోపల ఓ లెటర్‌తో పాటు, నాలుగు రూ.500 నోట్లు ఉన్నాయి.

అందులో “ప్రియమైన మేరీ అక్క.. చాలా ఏళ్ల క్రితం నేన జోసెఫ్ దగ్గర రూ.700 విలువైన సామగ్రి దొంగిలించా. ఇప్పుడు ఆ సరకు విలువ రూ.2000 ఉంటుంది. ఈ లేఖతో పాటు ఆ డబ్బులు పంపుతున్నా. ఇవి తీసుకుని నన్ను క్షమించండి” అని ఉంది.భర్త కూడా లేనందున ఈ లేఖ ఎవరు రాశారో ఇప్పుడు తెలుసుకోలేనని అంటోంది మేరీ. మిగిలిన దొంగలు కూడా ఇదే తరహాలో పశ్చాత్తాపం పొందితే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది.