నలుగురు కలసి పుట్టారు.. కలసి పెళ్లాడుతున్నారు.. - MicTv.in - Telugu News
mictv telugu

నలుగురు కలసి పుట్టారు.. కలసి పెళ్లాడుతున్నారు..

November 9, 2019

ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు పుట్టారు. వారంతా కలిసే చదువుకొని.. ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. వీరిలో నలుగురూ ఒకేసారి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.  1995లో జరిగిన ఐదుగురు కవలల జననం అప్పట్లో అందరిని ఆసక్తికి గురి చేసింది. వీరిలో నలుగురు అమ్మాయిలు కాగా ఒక అబ్బాయి జన్మించాడు. ఇక పెళ్లి వయస్సు రావడంతో వీరు మరోసారివార్తల్లోకి ఎక్కారు. ఒకేసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఈ ఐదుగురిలో నలుగురు అమ్మాయిలు ఒకేసారి పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే అబ్బాయి మాత్రం తన తోబుట్టువుల పెళ్లి చేసేందుకు ఏర్పాట్లను చూసుకుంటున్నారు. 

Kerala Twins.

వచ్చే ఏడాది ఏప్రిల్ 26 నలుగురు ఆడపిల్లలు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. గురువాయర్ లోని శ్రీకృష్ణ దేవాలయంలో ఒకేసారి వీరి వివాహం జరిపించేందుకు నిర్ణయించారు. చిరు వ్యాపారి కుటుంబంలో పుట్టిన ఈ కవల పిల్లలను చిన్నప్పటి నుంచి ఒకే రకంగా చూస్తూ వస్తున్నారు. ఉత్తర నక్షత్రంలో పుట్టడంతో వీరికి ఉత్రాజా, ఉత్తార, ఉత్తామ, ఉత్ర, ఉత్రాజన్ పేర్లు పెట్టారు.

ప్రస్తుతం వీరిలో  ఒక అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్,మరో ఇద్దరు అనేస్తేసియా టెక్నిషియన్లు చివరి అమ్మాయి ఆన్ లైన్ రైటర్ గా ఉన్నారు. ఇక వీరి సోదరుడు ఉత్రాజన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. పిల్లలు పెరిగి పెద్దకావడంతో పెళ్లి చేసేందుకు తల్లి తగిన జోడిని వెతికింది. వచ్చే ఏడాది వీరి పెళ్లిని ఒకే ముహూర్తానికి నిర్వహించనున్నారు. ఇప్పుడు వీరి వివాహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.