స్టూడెంట్స్​కు గుడ్ ​న్యూస్.. 6 నెలల పాటు మెటర్నటీ లీవ్స్ - Telugu News - Mic tv
mictv telugu

స్టూడెంట్స్​కు గుడ్ ​న్యూస్.. 6 నెలల పాటు మెటర్నటీ లీవ్స్

March 8, 2023

Kerala University announces 6-month maternity leave for female students

మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు కేరళ యూనివర్సిటీ శుభవార్త అందించింది. యూనివర్సిటీలో చదువుకునే మహిళలకు.. ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. 18 సంవత్సరాలు దాటిన అర్హులైన విద్యార్థినులకు.. ఈ సెలవులు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆరు నెలల పాటు ఈ సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పీరియడ్స్​ సమయంలో విద్యార్థినులకు సెలవులు ఇస్తుండగా.. తాజాగా కేరళ యూనివర్సిటీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.

 

ఈ సెలవులు పూర్తయిన తర్వాత నేరుగా క్లాసులకు హాజరు కావొచ్చని, మరోమారు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని స్సష్టం చేసింది. సంబంధిత అధికారులు విద్యార్థినులు తీసుకున్న లీవ్, మెడికల్ రిపోర్టులు పరిశీలించి క్లాసులకు అనుమతిస్తారని పేర్కొంది. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్ కేరళ ఉత్తర్వులు జారీ చేసింది. కిందటి వారం కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 రోజుల పాటు సెలవు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ప్రకటించిన తొలి యూనివర్సిటీ ఇదేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా విద్యార్థినులకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం కల్పించాయి.