బలవంతం చెయ్యబోతే నాలుక కొరికేసింది....శభాష్ శెల్లెమ్మ! - MicTv.in - Telugu News
mictv telugu

బలవంతం చెయ్యబోతే నాలుక కొరికేసింది….శభాష్ శెల్లెమ్మ!

August 3, 2017

గీవార్త సదివినంక మీరు గుడ శభాష్ శెల్లె మంచి పనిజేశ్నవ్ అని మెచ్చుకుంటరు,గీ శెల్లెకున్న ధైర్యం అందరి ఆడోళ్లకు ఉంటె…ఆడోళ్లను శిడాయించాల్నంటే ఒక్కొక్కడు గజ గజ వణుక్కుంట చుచ్చు పోస్కోవాల్సిందె.ఇంతకీ అసలు విషయం ఏందంటే కేరళలోని కొచిలో ఒకామె సోమవారం రాత్రి బైటికోదామని ఇంట్లకేలి బైటికచ్చిందట.గంతే ఇంటిపక్కపొంటి ఉండే ఓ బద్మాష్ గాడు ఆమె మీదికి దుంకి ఆగమాగం జేశి ముద్దువెట్టవోయిండట..గంతే  శెల్లె మటన్ బొక్క కొర్కినట్టు వాని నాలుకను కొర్కిందట,ఇంకేముంది మంట మంట అన్కుంట వాడు ఆడికేలి పత్తలేకుంట పారిపోయిండట.ఇగ గామె గ కొరికేసిన సగం నాలుకముక్కను తీస్కపొయ్యి పోలీస్ స్టేషన్ల వానిమీద కంప్లైంట్ ఇచ్చిందట,పోలీసోల్లు గుడ గామె జేశిన పనికి శభాష్ అని  మెచ్చుకొని గ బద్మాష్ గాని మీద  ఐపీసీ 447, 354, 367 సెక్షన్ల కింద కేసు నమోదు చేశి శిప్పకూడు తిన్పిస్తున్రట.ఇంతకు ముందుగుడ గదే కేరళలా ఓ బాబా వారు గుడ తన లీలలు ఒక అమ్మాయిమీద గిట్లనే సూపెట్టవోతే ఆమె ఆయ్న జనాంగాలను కోసేసింది.సూశిన్రా అక్కలు శెల్లెల్లు  మిమ్మల్ని ఎవడైనా శిడాయిస్తే   కాపాడనీకి  ఎవరో అస్తరని ఎద్రుసూడకుంట మీలోనే ఓ శక్తి ఉంది అని తెల్సుకోన్రి.శిడాయించెటోళ్ల శెమ్డలు తియ్యున్రి. అప్పుడు ఆడోళ్ల తెర్వు రావాలన్నా …మీదిక్కు సూడాలన్నా బట్టెవాజ్ గాళ్లకు సల్ల శెమ్టలు వట్టాలే ఏమంటరు.