Kerala Woman Completes 81 Online Courses in 24 Hours, Creates Unique World Record
mictv telugu

ఒక్కరోజులో 81 కోర్సులు కంప్లీట్ చేసింది.. ఇంటర్నేషనల్ రికార్డ్

September 9, 2022

సాధారణంగా ఎవరైనా కంప్యూటర్ కోర్సు ఒకటి, రెండు.. మహా అయితే ఓ పది నేర్చుకుంటారు. అయితే మరికొందరు మాత్రం కొన్ని సంవత్సరాలు టైమ్ తీసుకోని పదుల సంఖ్యలో కోర్సులు నేర్చుకుంటారు. కానీ ఓ యువతి మాత్రం కేవలం 24 గంటల్లోనే 81 కోర్సులను పూర్తి చేసింది. అత్యధిక ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా అంతర్జాతీయ రికార్డు సాధించింది. కొట్టాయం జిల్లా, ఇల్లికల్ గ్రామానికి చెందిన రెహ్నా షాజహాన్ కేవలం అర మార్కుతో జామియా మిలియా ఇస్లామియాలో ఎంకామ్ సీటు పొందలేకపోయింది. ఆ నిరాశతో కుంగిపోకుండా ఆన్‌లైన్ కోర్సులకు అప్లయ్ చేసింది. ఈ క్రమంలోనే కామన్ అడ్మిషన్ టెస్ట్‌(క్యాట్)కు ప్రిపేర్ అయిన రెహనా.. ఉత్తీర్ణత సాధించడమే కాక తన బ్యాచ్‌లో జామియా మిలియా ఇస్లామియాలో ఎంబీఏ సీటు పొందిన ఏకైక మలయాళీగా గుర్తింపు పొందింది. ఇదే క్రమంలో ఒకే రోజున అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ సర్టిఫికెట్స్ పొందడం ద్వారా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

కోవిడ్‌ టైమ్‌లోఆన్ లైన్ కోర్సులు చేయడం మొదలుపెట్టిన రెహానా ఒకే రోజులో 55 ఆన్‌లైన్‌ కోర్సులు పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె పనిచేసిన సంస్థ సీఈఓతో చెబితే.. వరల్డ్‌ రికార్డ్‌ కు ప్రయత్నం చేయమని సలహా ఇచ్చారట. అప్పటికి ప్రపంచ రికార్డు 24 గంటల్లో 75 కోర్సులుగా ఉంది. దీంతో ప్రయత్నం మొదలుపెట్టిన రెహనా.. 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి.. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. దుబాయ్‌ లోని ఓ కంపెనీలో హెచ్‌ ఆర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న రెహనా .. తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసి ఇండియా వచ్చేసింది. ఇక్కడ విద్యార్థులకు కెరీర్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌ గా పనిచేస్తుంది.