నెలసరికి  సెలవు...దేశమంతా పాటించాలని అంటున్న అమ్మలు అక్కలు..! - MicTv.in - Telugu News
mictv telugu

నెలసరికి  సెలవు…దేశమంతా పాటించాలని అంటున్న అమ్మలు అక్కలు..!

July 20, 2017

నెలసరి ,పీరియడ్స్  ఇదేదో వినకూడని పదం నిషేదించిన వ్యవహారంలాగా మన సమాజం ఇప్పటికీ భావిస్తుంది.మైలపోళ్లు,ముట్టుడు పేరుతో మహిళలను ఇంకా వేధిస్తున్న  కాలంలోనే మనం ఉన్నాం.అయితే మగాడికి వయసొచ్చిన తర్వాత మీసాలు గడ్డాలు ఎట్లా వస్తయో.. ఆడోళ్లకు గుడ వయసొచ్చిన తర్వాత నెలసరి రావడం ప్రకృతి సిధ్ధం.ఇంకా ఈ సమాజం నెలసరి,పీరియడ్స్ విషయంలో చర్చిండడానికి కూడా సిద్దంగా లేదు,ఇలాంటి సమయంలో కెరళలోని మాతృభూమి అనే న్యూస్ ఛానల్ ఓ మహత్తర నిర్ణయానికి తెర లేపింది,దేశానికే ఆదర్శంగా నిలబడ్డది.ఆ ఛానల్లో పనిచేసే ఉద్యోగులకు పీరియడ్స్ మొదలైన మొదటిరోజు సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది,పేరులోనే మాతృత్వాన్ని కలిగివున్న ఛానల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆదర్శవంతమైనది.ఈ నిర్ణయంతో చింత చిరాకులాంటివి మహిళా ఉద్యోగులు పక్కన పెట్టి పని చేస్తారని మాతృభూమి భావించినట్టు కనిపిస్తుంది.ఈ నిర్ణయాన్ని దేశంలోని అన్ని సంస్ధలుకూడా పాటించాలాని ఆశిద్దాం.