kerala young boys take bath in public
mictv telugu

ప్రాంక్‌ పేరుతో పిచ్చి పనులు.. కట్ చేస్తే కటకటాలు

November 5, 2022

ఈ మధ్య ప్రాంక్ ఫ్యాషన్ అయిపోయింది. నలుగురిని నవ్వించే విధంగా ఉండాల్సిన ప్రాంక్ శృతి మించుతోంది. ప్రతీ ఒక్కరూ ప్రాంక్ పేరుతో రోడ్డు మీదుకు వచ్చి.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించేందుకు ప్రాంక్ పేరిట నడిరోడ్డుపై హంగామా సృష్టిస్తున్నారు. విచిత్ర గెటప్‌లు, ఆకతాయి చేష్టలతో జనాలకి ఇబ్బంది కలిగిస్తున్నారు. తాజాగా ప్రాంక్ పేరుతో పబ్లిక్‌లో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు యువకుల ఆటకట్టించారు కేరళ పోలీసులు.

వివరాల్లోకి వెళ్తే.. బైక్‌పై ఇద్దరు యువకులు రోడ్డుపైకి వచ్చి అర్థనగ్నంగా స్నానం చేసారు. ట్రాఫిక్ లో అలా స్నానం చేస్తూ..సబ్బు రుద్దుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ వీడియో వైరల్ అయ్యి పోలీసుల కంటపడడంతో అడ్డంగా బుక్కయ్యారు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన కారణంగో వారిపై కేసు నమోదు చేసి రూ.5 వేలు ఫైన్ విధించారు పోలీసులు. ప్రాంక్ పేరుతో పిచ్చి వేషాలు వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాంక్ చేసిన యువకులు భరణిక్కవుకు చెందిన అజ్మల్, బాదుషాలుగా తెలుస్తోంది.