కేరళ సంచలనం.. పేదలకు ఉచితంగా ఇంటర్నెట్ - MicTv.in - Telugu News
mictv telugu

కేరళ సంచలనం.. పేదలకు ఉచితంగా ఇంటర్నెట్

May 30, 2020

 

Kerala's.

కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా, తక్కిన వారికి అందుబాటు ధరలలో ఇంటర్నెట్‌ సేవలను అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న కన్సార్టియం సంస్థలతో శుక్రవారం చర్చించారు. ఇందుకు అవసరమైన ఫైబర్‌గ్రిడ్( కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌) కె-ఫోన్‌ గురించి మాట్లాడి..  ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నారు. 

ఈ విషయమై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మాట్లాడుతూ.. ‘ఇంటర్నెట్‌ సదుపాయాన్ని పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తించడంలో కేరళ రాష్ట్రం దేశంలోనే మొదటిది. ఏ రాష్ట్రం కూడా ఈ దిశగా ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదు. ఈ సదుపాయం వల్ల డిజిటల్‌ రంగం మరింత వృద్ధిలోకి వస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు పనులు కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ కారణంగా ఆలస్యమవుతున్నాయి. అయినప్పటికీ డిసెంబరు కల్లా పూర్తిచేస్తామని కన్సార్టియం లీడర్ ఎమ్‌.వి గౌతమ్‌ మాటిచ్చారు’ అని ముఖ్యమంత్రి తెలిపారు.