సార్... కేరళ సర్కార్ ను చూసి నేర్చుకోండి... - MicTv.in - Telugu News
mictv telugu

సార్… కేరళ సర్కార్ ను చూసి నేర్చుకోండి…

June 7, 2017

ఉచిత విద్య సంగతి పక్కన పెట్టి… సర్కారీ స్కూల్ లో నాణ్యమైన చదువుకోసం అందరం ప్రయత్నించాల్సిందే… అందుకోసం కొత్త ప్రయోగాలు చేయాల్సిందే. ఇతర రాష్ట్రాలు ఎవైనా చేస్తే మనం చూసి నేర్చుకోవాల్సిందే. అయితే కేరళ ప్రభుత్వం స్కూళ్లలో సరికొత్త ప్రయోగాలు చేస్తుంది. కాసరగోడ్ జిల్లాలోని పిలికోడ్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను రైలు బోగీలుగా మార్చి విద్యార్థులను అందులో ఎక్కించి చదువు చెబుతున్నారు. దీంతో పిల్లలు చాలా అసక్తిగా స్కూల్ కి వస్తారని వారి అంచనా. ఈ స్కూల్ ని ఇలా తీర్చిదిద్దింది ఎవరంటే సంజిష్ వెంగర.