Kerintha movie fame sukrithi engagement photos goes viral in social media
mictv telugu

త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న ‘కేరింత’ నటి

June 12, 2022

Kerintha movie fame sukrithi engagement photos goes viral in social media

2015లో సుమంత్ అశ్విన్ హీరోగా వచ్చిన కేరింత మూవీ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెయిన్‌ హీరోయిన్‌ శ్రీ దివ్యతో పాటు మరో నటి సుకృతికి కూడా యాక్టింగ్‌లో మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమాలో భావన అనే క్యారెక్టర్ అంటే అందరూ గుర్తుపడతారు. అంతలా ప్రేక్షకుల్లోకి ఎక్కేసిందీ ఆ క్యారెక్టర్‌. అయితే వ్యక్తిగత కారణాలతో కేరింత తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే త్వరలోనే ఈ అందాల భామ పెళ్లిపీటలెక్కనుంది. తాజాగా సుకృతికి అక్షయ్ సింగ్ అనే వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఈ జంట ఇద్దరూ కలిసి తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందమైన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.