చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా.. కేసీఆర్‌తో కేేకే.. - MicTv.in - Telugu News
mictv telugu

చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తా.. కేసీఆర్‌తో కేేకే..

October 17, 2019

Keshava Rao Meet CM KCR

సీఎం కేసీఆర్‌తో పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు, రవాణా మంత్రి పువ్వాడ అజయ్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌కు వెళ్లిన నేతలు ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఆర్టీసీ జేఏసీతో చర్చించేందుకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని కకే.. కేసీఆర్‌తో చెప్పినట్టుగా తెలుస్తోంది. సమ్మెపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వం, కార్మికులతో చర్చలు జరిపి 18వ తేదీలోపు నివేధిక ఇవ్వాలని సూచించింది. దీనికి గడువు దగ్గర పడుతుండటంతో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరి మధ్య  చర్చల అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా సమాచారం. 

కాగా ఇటీవల కేకే ఆర్టీసీ కార్మికులు పంతానికి పోకుండా ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ.. ముందుకు వస్తే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఆయన మాటపై వెంటనే స్పందించిన అశ్వత్ధామరెడ్డి చర్చలపై సుముఖత వ్యక్తం చేశారు. తర్వాత దీనిపై స్పందించిన కేకే తాను సీఎం కేసీఆర్‌తో సంప్రధించలేదని ఆయన నుంచి సానుకూలత వ్యక్తం అయితే చర్చిద్దామంటూ పేర్కొన్నారు. ఈ సమయంలోనే కేశవరావు సీఎం కేసీఆర్‌తో భేటీ కావడంతో ఆసక్తిగా మారింది. కాగా కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీకి కొత్త ఎండీని కూడా నియమించే అంశంపై మంత్రి పువ్వాడ అజయ్ చర్చించారు.