విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల్లో కీలక మార్పులు

April 7, 2022

bgb

తెలంగాణ విద్యాశాఖ పదవ తరగతి పరీక్షల్లో పలు మార్పులు చేసింది. ఆ వివరాలను బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాకు విడుదల చేశారు. 1. మేలో జరగనున్న పరీక్షలకు అరగంట సమయాన్ని పెంచారు. 2. కరోనా వల్ల ప్రత్యక్ష తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఈ సారి ఆరు పేపర్లతో పరీక్ష నిర్వహిస్తున్నారు. 3. మొత్తం సిలబస్‌లో 70 శాతం సిలబస్‌తోనే ప్రశ్నలుంటాయి. అందులోనూ ఛాయిస్‌లు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఐదు లక్షల మంది హాజరయ్యే పదో తరగతి పరీక్షకు తగ్గట్టు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మరోవైపు వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతుండగా, అందుకు అనుగుణంగా టీచర్లకు శిక్షణను వేగవంతం చేయాలన్నారు. త్వరలో నిర్వహించే టెట్ పరీక్షలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.