Key directions of the Supreme Court on the Gnanavapi Mosque
mictv telugu

జ్ఞానవాపి మసీదుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

May 17, 2022

Key directions of the Supreme Court on the Gnanavapi Mosque

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు వీడియో సర్వేలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా ముస్లింలకు మసీదులో నమాజు చేయడానికి అనుమతించింది. అదే సమయంలో సర్వేలో బయటపడిన శివ లింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని ఆదేశించింది.

మసీదు ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణను స్థానిక కలెక్టర్‌కు ఇచ్చింది. తదుపరి విచారణను మే 19కి వాయిదా వేసింది. అంతకు ముందు వారణాసి కోర్టు సర్వే విషయంపై విచారించింది. కోర్టు సర్వే కోసం నియమించిన కమిటీ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను తొలగించింది. సర్వేలోని అంశాలను కోర్టుకు సమర్పించకముందే లీక్ చేయడంతో ఆయనపై ఈ చర్య తీసుకుంది. అసిస్టెంట్ కమిషనర్‌గా అజయ్ ప్రతాప్ సింగ్ ఉండగా, సర్వే రిపోర్టు కోసం ప్రతాప్ సింగ్ రెండు రోజులు గడువు కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది.