యావత్ దేశ ప్రజలు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశప్రజలే కాదు..ప్రపంచ దేశాలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాధారణ బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఇవాళ ప్రవేశపెట్టబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం..ఉదయం 9గంటలకు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటారు ఆర్థిక మంత్రి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం అవుతారు. కాసేపు మాట్లాడిన అనంతరం రాష్ట్రపతి బడ్జెట్ ను ఆమోదిస్తారు. అక్కడితో ఘట్టం పూర్తవుతుంది. అక్కడి నుంచి పార్లమెంట్ చేరుకుంటారు నిర్మలాసీతారామన్. వెంటనే కేంద్ర కేబినేతో సమావేశం అవుతారు. ప్రధాని అధ్యక్షత కేబినెట్ 10,30గంటలకు ఆమోదిస్తుంది.
అనంతరం 11 గంటలకు లోకసభకు చేరుకుంటారు. బడ్జెట్ లోకసభలో ప్రవేశపెడతారు. ఇది పేపర్ లెస్ బడ్జెట్ కావడంతో ఎక్కువగా సమయం తీసుకోరు. మధ్యాహ్నం 1గంటలోపే ప్రసంగం ముగిసే ఛాన్స్ ఉంటుంది. అనంతరం రెండు సభలు కూడా గురువారానికి వాయిదా పడతాయి. గురువారం రాష్ట్రపతి ప్రసంగంతో సభ మొదలవుతుంది.
ఈసారి భారీగా అంచనాలు
కాగా ఈసారి బడ్జెట్ పై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఆర్థిక సర్వే తో భారీ అంచనాలు పెరిగాయి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం లేదు. కాబట్టి ఈసారి బడ్జెట్ పై భారీగా అంచనాలు పెంచుకున్నారు సామాన్య ప్రజలు. ఈసారి పద్దు కూడా అందర్నీ ఆకట్టుకోదని..ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ఆ ప్రభావం మన దేశ పద్దుపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రక్షణ రంగం, రైల్వేలు వంటి వాటికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరికొద్దిగంటల్లో ఈ సస్పెన్స్ కు తెరపడునుంది.