లవ్ మ్యారేజ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన: MP హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

లవ్ మ్యారేజ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన: MP హైకోర్టు

February 23, 2022

bfcgbcv gbr

కులాంతర వివాహాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా తండ్రీకూతుళ్ల బంధం ముగిసిపోదని తెల్చీ చెప్పింది. తండ్రికి ఇష్టంలేకపోయిన కూతురు ప్రేమించి పెళ్లిచేసుకున్నా కూడా ఆ కూతురి బాధ్యతను తండ్రి కచ్చితంగా తీసుకోవాలని వ్యాఖ్యనించింది. హోషంగాబాద్‏కు చెందిన ఫైజల్ ఖాన్.. తన ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు మహిళా ఆశ్రమంలో బంధించారని ఆరోపిస్తూ, హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ ఎంఎస్ భట్టిలు సమక్షంలో జరిగిన ఈ విచారణలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘అమ్మాయి పెద్దయ్యాక తనకు నచ్చినట్టుగా జీవించే స్వేచ్చ, హక్కు ఉంటుంది. కూతురికి కులాంతర వివాహం అయిన తర్వాత కూడా ఆమెను రక్షించే బాధ్యత ఆ తండ్రిదే. ఆ తండ్రి తన కుమార్తెకు పూర్తిగా రక్షణ కల్పించే తండ్రిగా వ్యవహరించాలి” అని తెల్చీ చెప్పింది.