హైదరాబాద్‌లో రూ. 35 కే కిలో ఉల్లిగడ్డ.. ఎక్కడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో రూ. 35 కే కిలో ఉల్లిగడ్డ.. ఎక్కడంటే..

October 24, 2020

Onion

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు చుక్కలను అంటాయి. ఉల్లి ధర ఘాటెక్కించడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కిలో రూ. 100కు చేరడంతో సగటు మధ్యతరగతి వారు కొనడానికి కూడా వీలులేకుండా పోయింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొంత ఊరట కలిగించే వార్తను చెప్పింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రూ. 35 కే కిలో ఉల్లి గడ్డ అందిస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బజార్లలో తక్కువ రేటుకే అందిస్తామని వెల్లడించారు. 

జంట నగరాల్లోని 11 రైతుబజార్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. వినియోగదారుడు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి తీసుకువెళ్లే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతి వ్యక్తికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తామని వెల్లడించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట దెబ్బతింది. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతుబజార్లలో కిలో రూ.75కు విక్రయిస్తుండగా, బయటి మార్కెట్లో మాత్రం వంద రూపాయలు పలుకుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమ్మకాలు జరపాలని మార్కెటింగ్ అధికారులను నిరంజన్ రెడ్డి ఆదేశించారు.