కేజీఎఫ్ వసూళ్లు.. బాలీవుడ్‌లో తొలి సినిమాగా రికార్డు - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్ వసూళ్లు.. బాలీవుడ్‌లో తొలి సినిమాగా రికార్డు

April 15, 2022

 kgs

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా వచ్చిన కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లో తొలిరోజు రూ. 53.95 కోట్లను రాబట్టింది. తద్వారా హిందీలో తొలిరోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాగా నిలిచింది. ఈ క్రమంలో వార్ రూ. 51.60 కోట్లు, థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూ. 50.75 కోట్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ తెలిపారు. ఇదిలా ఉండగా, కేజీఎఫ్ తొలిరోజు వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 150 కోట్లుగా నమోదైంది. కాగా, ఇప్పటికే అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిన తొలి కన్నడ సినిమాగా కేజీఎఫ్ 2 నిలిచింది.