'KGF-3' launches in December: Vijay Kirgandur
mictv telugu

డిసెంబర్‌లో ‘కేజీఎఫ్-3’ షురూ: విజయ్ కిర్గందూర్

May 14, 2022

'KGF-3' launches in December: Vijay Kirgandur

‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2’ చిత్రాలతో దేశవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరో తాజా విషయాన్ని సినీ ప్రియులకు తెలియజేశారు. ‘కేజీఎఫ్ 2’ విడుదల కాకముందు నుంచి ‘కేజీఎఫ్ 3′ సినిమా ఉంటుందా? అని ప్రేక్షకులు, యాంకరులు, పలువురు డైరెక్టర్లు ప్రశాంత్ నీల్‌ను ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్తూ..” ఫస్ట్ అయితే కేజీఎఫ్ 2 సినిమా విడుదల కానివ్వండి. ఆ తర్వాత ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇక, ‘కేజీఎఫ్ 2’ సినిమా ఆఖరులో దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్ పార్ట్ 3’ గురించి హింట్ కూడా ఇచ్చాడు. దాంతో అందరూ ‘కేజీఎఫ్ పార్ట్ 3’ కూడా ఉంటుందని అంచనాలు వేసుకున్నారు. ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తూ, నిర్మాత విజయ్ కిర్గందూర్ సంచలన ప్రకటన చేశాడు. డిసెంబర్ 2022లో ‘కేజీఎఫ్ పార్ట్ 3’ లాంఛనంగా ఆరంభించబోతున్నట్లు తెలిపారు. ”ప్రస్తుతం ప్రశాంత్ ప్రభాస్ ‘సాలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్ కల్లా ఇది పూర్తవుతుంది. ఆ తర్వాత ‘కేజీఎఫ్ 3’పై దృష్టిపెట్టనున్నాడు.”

మరోపక్క ప్రశాంత్ నీల్ ఇటీవలే జూ. ఎన్టీఆర్ 31 చిత్రం కోసం ఫోటోషూట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 20న (జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు) సందర్భంగా వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ ‘కేజీఎఫ్ 3’ ని ఆరంభిస్తే గనుక ఎన్టీఆర్ సినిమా మరి కాస్త ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.