'కేజీఎఫ్' నటుడు కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

‘కేజీఎఫ్’ నటుడు కన్నుమూత

May 7, 2022

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్-1, కేజీఎఫ్-2లో కీలక పాత్రలో నటించిన ప్రముఖ కన్నడ నటుడు, కమెడియన్ మోహన్ జునేజా (54) మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆయన దీర్ఘకాల కాలేయ వ్యాధితో పోరాడుతూ, శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి అధికారులు తెలిపారు. మోహన్ జుజా మృతిపట్ల కన్నడ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ అభిమానులు నివాళులు అర్పించారు. జునేజా అంత్యక్రియలు శనివారం సాయంత్రం బెంగళూరులోని తమ్మెనహళ్లిలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లాలో పుట్టి, పెరిగిన జునేజా.. చిత్రసీమ పరంగా మంచి హాస్యనటుడిగా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించారు. ఇటీవలే ఆయన నటించిన ‘కేజీఎఫ్ 2’లో రాఖీభాయ్ పాత్ర గురించి ఓ జర్నలిస్ట్‌కి చెబుతూ, ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే పాత్రలో నటించారు. ఆ పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.