సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య సినీతారలు సాధారణ ప్రజలకు చాలా దగ్గరయ్యారనే చెప్పాలి. వారి వ్యక్తిగత విషయాలను , ప్రొఫెషనల్ సంగతులను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ వారితో ఎప్పుడూ టచ్‌లో ఉంటున్నారు. ఒకప్పుడు ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే కనిపించే సెలబ్రిటీలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతి రోజూ ముచ్చటిస్తున్నారు. అయితే కొంతమంది వక్రబుద్ధి కలవారు ఈ మాధ్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. లేనిపోని కథలు అల్లి స్టార్స్‌ను ఇరకాటంలో పెడుతున్నారు. వారికి కొత్త చిక్కులను తీసుకువచ్చిపెడుతున్నారు. తాజాగా కేజీఎఫ్ బ్యూటీ ఇలాంటి ఓ వివాదంలోనే చిక్కుకుంది. కేజీఎఫ్ స్టార్ హీరో యశ్ మంచివాడు కాదంటూ అతనితో ఇకపై నటించేది లేదంటూ శ్రీనిధి శెట్టి చెప్పినట్లు ఓ ట్వీట్ నెట్టింట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీనిధి యశ్ అంటే తనకు ఎంతో ఇష్టమని , అతనితో మళ్లీ పని చేయాలని ఉందని క్లారిటీ ఇచ్చి కాంట్రవర్సీని కూల్ చేసింది. కొంతమంది సన్నాసులు, పాపులారిటీ కోసం కావాలనే తన పేరును ఉపయోగించుకుని ట్వీట్లు చేస్తున్నారని, తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించింది.
ట్విట్టర్లో ఉమర్ సంధు అని ఒకడు ఉంటాడు. అతను తాను సినీ విమర్షకుడిని అని కొంత కాలంగా హల్ చల్ చేస్తున్నాడు. సౌత్‌లో వెండితెరపై రిలీజ్ అయిన సినిమాలపై, తారలపై ట్వీట్లు చేస్తూ వారిని వివాదాల్లోకి లాగుతుంటాడు. ఇదే విధంగా యశ్ గురించి ట్వీట్ చేశాడు ఉమర్. యశ్ మంచివాడు కాదని, ఆయన ప్రవర్తన వల్ల ఇబ్బందిపడ్డానని హీరోయిన్ శ్రీనిధి చెప్పినట్లు ట్వీట్ చేశాడు. దీంతో నెట్టింట్లో ఈ వార్తు సెన్సేషన్ అయ్యింది. ఈ ట్వీట్‌ను చూసిన యశ్ అభిమానులు హీరోయిన్‌పై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన శ్రీనిధి ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది.