హైదరాబాద్ హత్యల్లో ‘కేజీఎఫ్’ ప్రభావం! - Telugu News - Mic tv
mictv telugu

హైదరాబాద్ హత్యల్లో ‘కేజీఎఫ్’ ప్రభావం!

May 14, 2022

హైదరాబాద్ నగరంలో ఈ మధ్య వరుసగా చోటుచేసుకుంటున్న హత్యలలో బ్లాక్ బస్టర్ సినిమా ‘కేజీఎఫ్’ ప్రభావం కనిపిస్తోంది. మీర్ పేట్ ప్రశాంతి హిల్స్‌లో శ్వేతారెడ్డి తన మాజీ ప్రియుడు యశ్మంత్ కుమార్‌ను తాజా ప్రియుడు అశోక్‌తో హత్య చేయించింది. ఈ ఘటనలో అశోక్ యశ్మంత్ కుమార్‌ను సుత్తితో తల వెనుక పలుమార్లు బలంగా కొట్టడంతో కోమాలోకి వెళ్లి కొన్ని రోజులకు యశ్మంత్ కుమార్ చనిపోయాడు. కొద్దిరోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో తన భార్య జ్యోతి, ఆమె ప్రియుడు యశ్వంత్‌లను ఆమె భర్త శ్రీనివాసరావు కూడా మొదట సుత్తితోనే దాడి చేశాడు. ఆ తర్వాత స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపాడు. ఈ రెండు ఘటనల్లోనూ కేజీఎఫ్ సినిమాలో కథానాయకుడు ఉపయోగించిన సుత్తినే ఆయుధంగా నిందితులు వాడారు. దీంతో సినిమా ప్రభావమే కారణమని పోలీసులు కూడా భావిస్తున్నారు.