కేజీఎఫ్ హీరోపై పెత్తనం చేస్తున్న చిన్నారి - MicTv.in - Telugu News
mictv telugu

కేజీఎఫ్ హీరోపై పెత్తనం చేస్తున్న చిన్నారి

May 8, 2019

ఇటీవల వచ్చిన సినిమాల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ‘కేజీఎఫ్’.. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు కన్నడ హీరో యష్. తాజాగా యష్ తన అభిమానులతో ఓ విషయం పంచుకున్నాడు. మంగళవారం అక్షయ తృతీయ కావడంతో తన కూతురు తొలి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశాడు.

‘నా ప్రపంచాన్ని పాలిస్తున్న అమ్మాయిని చూడండి. తనకు ఇంకా పేరు పెట్టలేదు. ఇప్పటి నుంచి తనను ‘బేబీ వైఆర్‌’ అని పిలవండి. పాపపై మీ ప్రేమను కురిపించండి, ఆశీర్వదించండి’ అని యష్ ట్వీట్‌ చేశాడు. అలాగే యష్ సతీమణి రాధిక పండిట్ కూడా కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం ఆ పాపకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యష్, రాధికలు 2016లో బ్ర‌హ్మీస్‌-గౌడ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకోగా, డిసెంబ‌ర్ 2,2018న వారికి పండంటి బిడ్డ పుట్టింది. రాధిక‌, య‌శ్‌లు టీవీ సీరియ‌ల్స్‌తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేయ‌గా, 2008లో ‘మూగిన మనసు’ సినిమాతో తొలిసారి వెండితెర‌కి ప‌రిచ‌యం అయ్యారు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మరో నాలుగు సినిమాలు చేశారు. అప్పుడే యష్, రాధిక మధ్య ప్రేమ చిగురించడంతో 2016లో కుటుంబ సభ్యులను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

కేజీఎఫ్ మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ‘కేజీఎప్ 2’ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.  ప్రస్తుతం యష్ ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది