కలెక్షన్లలో బాహుబలి 2 రికార్డు బద్దలుకొట్టిన కేజీఎఫ్ 2 - MicTv.in - Telugu News
mictv telugu

కలెక్షన్లలో బాహుబలి 2 రికార్డు బద్దలుకొట్టిన కేజీఎఫ్ 2

April 18, 2022

baha

కేజీఎఫ్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన రెండో పార్టు ఇప్పటికే పలు సంచనాలు నమోదు చేసింది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలో అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ సినిమా ఇప్పుడు రాజమౌళి బాహుబలి 2 సినిమాను అధిగమించింది. హిందీలో బాహుబలి సినిమా ఆరు రోజుల్లో రూ. 200 కోట్లను వసూలు చేయగా, కేజీఎఫ్ 2 ఐదురోజుల్లోనే ఆ ఘనత సాధించింది. దీంతో అతి తక్కువ రోజుల్లో రెండొందల కోట్లు వసూలు చేసిన సినిమాగా చరిత్రకెక్కింది. కాగా, ఈ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 410 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 127. 25 కోట్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా రూ. 500 కోట్ల క్లబ్బులో చేరింది. త్వరలో రూ. వెయ్యి కోట్ల లిస్టులో ఎక్కుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ సందర్భంగా హీరో యశ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాక్షన్ సీన్లలో ఇరగదీశాడని పొగుడుతున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ యశ్‌ను మరో అమితాబ్‌గా వర్ణించింది. తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంటులో కేజీఎఫ్ 2 పోస్టర్‌ను షేర్ చేస్తూ ‘కొన్నేళ్లుగా భారత సినీ పరిశ్రమ మిస్సయిన యాంగ్రీ యంగ్ మ్యాన్ యశ్. 1970 లో అమితాబ్ బచ్చన్ వచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆ స్థానం ఖాళీగా ఉంది. ఆ స్థానంలోకి ఇప్పుడు యశ్ వచ్చాడు’ అంటూ రాసుకొచ్చింది.