'కేజీఎఫ్ 2' మరో రికార్డ్.. ఏకంగా 1100 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

‘కేజీఎఫ్ 2’ మరో రికార్డ్.. ఏకంగా 1100 కోట్లు

May 7, 2022

‘కేజీఎఫ్ చాప్ట‌ర్-2’ సినిమా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచి నేటీ వరకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్ పరిశ్రమల్లో కలెక్షన్స్ పరంగా రికార్డులు బద్దలు కొడుతుంది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా విడుద‌లైన ప్ర‌తి భాష‌లో గత రికార్డులను బ్రేక్ చేస్తూ, నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ చిత్రం ఇటీవలే 1,100కోట్ల మార్క్‌ను అధిగ‌మించి మరో రికార్డు సృష్టించింది అని చిత్రబృందం తెలిపింది. మిగతా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్‌లో ఈ చిత్రం స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసిందని పేర్కొంది.

”కలెక్ష‌న్ల‌లో ఖాన్‌, క‌పూర్‌ల‌ను సైతం వెన‌క్కి నెట్టి, రాఖీబాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. చిత్రం విడుద‌లై 20 రోజులు దాటింది. కానీ, క‌లెక్ష‌న్ల విషయంలో జోరు త‌గ్గ‌డం లేదు. ఈ చిత్రం బాలీవుడ్‌లో 400 కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. ‘బాహుబ‌లి-2’ త‌ర్వాత 400 కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన సినిమాగా కేజీఎఫ్ రికార్డు సృష్టించింది. కేవ‌లం 23 రోజుల్లోనే బాలీవుడ్‌లో ఈ స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించటం కేజీఎఫ్‌ సినమాకే సాధ్యమైంది.”