బాలీవుడ్‌లో కెజిఎఫ్ 2 రికార్డు.. భారీగా పెరుగుతున్న అంచనాలు - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్‌లో కెజిఎఫ్ 2 రికార్డు.. భారీగా పెరుగుతున్న అంచనాలు

April 8, 2022

kgf

కన్నడ చిత్ర పరిశ్రమ తరపున మొదటి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన కెజిఎఫ్ చిత్రం సంచలన విజయం నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనిసాగింపుగా వచ్చిన రెండో పార్టు ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో హిందీ వెర్షన్‌లో 12 గంటల్లోనే దాదాపు లక్ష టిక్కెట్లు బుక్కయ్యాయి. తొలిరోజు బుకింగ్స్ ద్వారానే రూ. 3 కోట్లను రాబట్టింది. దీన్ని బట్టి ఈ సినిమా క్రేజ్ ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. పుణే, సూరత్, కోల్‌కతా, లక్నో, జైపూర్ వంటి పట్టణాల్లో ఇప్పటికే పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ముంబైలో ఒక్కరోజులో టిక్కెట్ల బుకింగ్ ద్వారా రూ. 75 లక్షల రూపాయలు కొల్లగొట్టింది. ఇంకా చాలా ప్రాంతాల్లో బుకింగ్స్ ప్రారంభం కాలేదు. లేకపోతే ఆర్ఆర్ఆర్ రికార్డు బద్దలయ్యేదేమో. ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ల బుకింగ్స్ ద్వారా 5 కోట్లను సంపాదించింది. ఇదిలా ఉండగా, బుధవారం నాటికి కెజిఎఫ్ 2 బుకింగుల ద్వారా 15 నుంచి 17 కోట్ల వరకు వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనా. ఈ లెక్కన ఒక్క బాలీవుడ్‌లోనే మొదటిరోజు వసూళ్లు 50 కోట్లను దాటుతుందని భావిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి తెలిసిన నటులు ఉండడంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడతారని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ చిత్రం టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంది.