కరోనా కారణంగా వాయిదాలు పడుతూ గురువారం విడుదలయిన కేజీఎఫ్ 2 చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పదివేల స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల వసూలును సాధించిన తొలి కన్నడ చిత్రంగా రికార్డు నమోదు చేసింది. అలాగే హిందీలో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసే దిశగా సాగుతోంది. ఇదిలా ఉండగా, హైదరాబాద్ మల్కాజ్ గిరీలోని ఓ థియేటర్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నెల క్రితం మరమ్మత్తులు చేసుకొని ప్రారంభమైన రాఘవేంద్ర 35 ఎంఎం థియేటర్లో నిన్న కేజీఎఫ్ 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకుల కోరిక మేరకు యాజమాన్యం సౌండు పెంచడంతో బాక్సులు ఊడి కింద పడ్డాయి. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, స్పీకర్లు ఊడిపడడంతో నిర్వాహకులు షోను రద్దు చేసి టిక్కెట్ డబ్బులు తిరిగిచ్చి పంపించేశారు. కాగా, గతంలో బాలయ్య బాబు అఖండ సినిమాకు ఇలాగే జరిగింది. యూఎస్‌లోని ఓ థియేటర్లో థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్కు సౌండ్ బాక్సుల్లో నుంచి మంటలు వచ్చాయి.