‘ఆర్ఆర్ఆర్’ రికార్డును అధిగమించిన ‘కెజిఎఫ్ 2’ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్’ రికార్డును అధిగమించిన ‘కెజిఎఫ్ 2’

March 30, 2022

vc cbcvb

దక్షిణాది సినిమాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. నువ్వా, నేనా అంటూ వరుస రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం అనేక రికార్డులను సృష్టిస్తూ దూసుకెళ్తుండగా, గతంలో సంచలన విజయం సాధించిన కెజిఎఫ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన కెజిఎఫ్ 2 దాన్ని మించిన రికార్డులను క్రియేట్ చేస్తోంది. తాజాగా విడుదలైన కెజిఎఫ్ 2 ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రికార్డులను బద్ధలు కొట్టింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కు 24 గంటల్లో 51.12 మిలియన్లు, రాధేశ్యామ్ 57.50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను కెజిఎఫ్ 2 అధిగమించింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. ఈ విషయంలో బాలీవుడ్ సోదిలో లేకుండా పోయింది. కాగా, కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదల అవుతోంది.