తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ కార్పొరేటర్ షాకిచ్చారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన పీజేఆర్ కూతురు పి. విజయా రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. మంచి భవిష్యత్తు కోసం, పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకు కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు తెలిపారు. ఈ నెల 23 వ తేదీన తండ్రి మరణించేంత వరకు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాగా, టీఆర్ఎస్ తరపున రెండు సార్లు కార్పొరేటర్‌గా గెలిచిన విజయారెడ్డి.. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశించారు. అయితే అవకాశం రాకపోవడంతో కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరడానికి నిర్ణయించినట్టు తెలుస్తోంది.