ఇకపై మట్టి గణపయ్య- ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై మట్టి గణపయ్య- ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి

September 2, 2017

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యావరణ స్పృహ ప్రకటిస్తూ వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ఉత్సవ సమితి అధ్యక్షుడు సుదర్శన్ తెలిపారు.

మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు హామీ ఇచ్చాం. శిల్పి రాజేంద్రన్ సైతం మట్టి విగ్రహం తయారీకి ఒప్పుకున్నారు. పీవోపీ(ప్లాస్టర్ అఫ్ పారిస్) తో చేసిన విగ్రహం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతోంది. చెరువు కలుషితం కాకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.