Khairatabad Ganesh idol will be made of clay
mictv telugu

ఖైరతాబాద్ గణేష్.. మట్టితో చేసే విగ్రహ ఎత్తు ఎన్ని అడుగులంటే..

June 27, 2022

తెలుగు రాష్ట్రాల్లో పేరు గాంచిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఈ సారి మట్టితో ఏర్పాటు కానుంది. గణేష్‌కు సంబంధించిన నమూనాను ఉత్సవ కమిటీ సోమవారం విడుదల చేసింది. 50 అడుగుల ఎత్తుతో పూర్తిగా మట్టితో నిర్మాణం జరుగనుంది. అదికాక, ఈ సారి పంచముఖ లక్ష్మీ గణపతి రూపంలో వినాయకుడు దర్శనమివ్వనున్నాడు. ఎడమ వైపు త్రిశక్తి మహా గాయత్రి, కుడి వైపు సుబ్రహ్మణ్యస్వామితో రూపొందనున్నాడు. కాగా, ఇప్పటివరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో గణేశుడు రూపుదిద్దుకునేవాడు. అయితే పర్యావరణం పేరిట హైకోర్టు దానిని నిషేధించడంతో ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సారి మట్టితో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

 

 

khairatab