వెళ్లిరా వినాయకా.. భారీ గణపయ్యకు ఘన వీడ్కోలు - MicTv.in - Telugu News
mictv telugu

వెళ్లిరా వినాయకా.. భారీ గణపయ్యకు ఘన వీడ్కోలు

September 12, 2019

Khairatabad Ganesh....

మహాగణపతికి మనసారా వీడ్కోలు పలికారు భాగ్యనగర వాసులు. భక్త జన సందోహం మధ్య ద్వాదశముఖ లంబోదరుడిని గంగమ్మ ఒడికి చేర్చాడు. 10 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడినికి మధ్యాహ్నం1.46 గం.లకు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేశారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేశారు. గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి ముందుగా స్వామివారి కలశాన్ని ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం చేశారు. ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

tt

తెల్లవారు జామున ప్రారంభమైన గణనాథుడి శోభయాత్రతో నగరవీధుల గుండా హుస్సేన్ సాగర్ చేరుకుంది. ఏడు గంటల పాటు ఈ శోభాయాత్ర సాగగా దారిపొడవున భక్తులు పూలు చల్లుతూ.. స్వామిని దర్శించుకున్నారు. 50 టన్నుల బరువు ఉన్న భారీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన క్రేన్ సాయంతో ఈ ఘట్టం ముగించారు. గంగమ్మ ఒడికి చేరుతున్న సమయంలో భక్తులంతా  ‘జై బోలో గణేశ్‌ మహారాజ్‌ కీ.. జై’ నినాదాలు చేశారు. మహా గణపతి నిమజ్జనం తర్వాత మిగితా వినాయక ప్రతిమల నిమజ్జన కార్యక్రమాన్ని వేగంగా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా గణనాథుని విగ్రహాలు తరలివస్తున్నాయి. 

r