ప్రపంచ ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం ఘనంగా ముగిసింది. అంగరంగ వైభవంగా సాగిన శోభాయాత్ర ద్వారా గణేశుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. అంతకు ముందు ట్యాంక్ బండ్ పై పూజారులు పూజలు నిర్వహించారు. తర్వాత భారీ క్రేన్ సాయంతో హుస్సేన్ సాగర్ లో నిజజ్జనం చేశారు. ఖైరతాబాద్ గణపతితోపాటు జంట నగరాల నుంచి వందలాది వినాయకులు ట్యాంక్ బండ్ పై కనువిందు చేశారు. ‘గణపతి బప్పా.. మోరియా.. జై బోలో గణపతి మహరాజ్ కి ’ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఆబాలగోపాలం చిందులేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. భక్తులు ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ మంచినీటి పొట్లాలను అందజేసింది.